![]() |
![]() |

శ్రద్ధాకపూర్ విషయంలో రణ్‌బీర్‌కి ఆలియా షరతులు విధించారా? అదే నిజమైతే, ఏమని అన్నారు? ఏయే విషయాల్లో కండిషన్స్ పెట్టారు? ఇప్పుడు బాలీవుడ్‌లో ఇదో హాట్ టాపిక్. గతేడాది బ్రహ్మాస్త్ర షూటింగ్ పూర్తికాగానే పెళ్లి చేసుకున్నారు రణ్‌బీర్ కపూర్, ఆలియా. ఆ వెంటనే ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేశారు. వారికి రహా కూడా పుట్టింది. ఇప్పుడు హ్యాపీ పేరెంట్స్ గా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. ఆలియా పోస్ట్ ప్రెగ్నెన్సీ ట్రీట్‌మెంట్‌లో ఉన్నారు. నార్మల్ ఫిజిక్‌కి రావడం కోసం ఎక్సర్‌సైజులు కూడా చేస్తున్నారు. ఇటీవలే కశ్మీర్‌కి షూటింగ్ కోసం వెళ్లారు. రణ్‌బీర్ కూడా షూటింగ్ పనులు చేసుకుంటున్నారు. తూ జూటీ మే మక్కర్ సినిమా ప్రమోషన్లలోనూ బిజీగా పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో నటించారు శ్రద్ధాకపూర్. ఈ సినిమా ప్రమోషన్లలో ఉన్న రణ్‌బీర్ కపూర్‌కి విలేకరుల నుంచి ఎదురైన ప్రశ్న అందరిని ఆకట్టుకుంటోంది.
``శ్రద్ధతో అంత క్లోజ్‌గా ఉండవద్దని మీకు ఆలియా చెబుతున్నారట కదా``అని క్వశ్చన్ అడిగారు రిపోర్టర్. అందుకు రణ్‌బీర్ సరదాగా స్పందించారు.. ``ఆమె అలా ఎందుకు అంటారు? మీరే అలాంటివి ఊహించుకుంటున్నారు. ఆమె అసలు అలా అనదు. మీరు కాంట్రవర్శీ క్రియేట్ చేస్తున్నారు. నా లైఫ్‌లో ఇప్పుడు కాంట్రవర్శీ అసలు లేదు`` అని అన్నారు నవ్వుతూ. హోలీ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను ఇంకా ఆలియా చూడలేదట. ఈ చిత్రం విడుదలయ్యే సమయానికి ఆలియా కశ్మీర్‌లో ఉంటారట. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ షూటింగ్ అక్కడ జరుగుతోంది. ఆలియా ఆ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 9న ముంబైకి వచ్చేస్తారు. అప్పుడు కచ్చితంగా చూస్తారు. ఆమె ఎప్పుడూ నా చీర్ లేడీ. నా షంషేరాను కూడా ఆమె చూశారు`` అని అన్నారు. తూ జూటీ మే మక్కర్ సినిమాను లవ్ రంజన్ డైరక్ట్ చేశారు. మార్చి 8న విడుదల కానుందీ సినిమా.
![]() |
![]() |